TG GOVT: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:19 PM
TG GOVT: నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని,, వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.

వరంగల్ : తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసమేనని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్‌లో ఇవాళ(శుక్రవారం) మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్‌మేళాను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన వచ్చిందని అన్నారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఇలాంటి జాబ్‌మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని సూచించారు. అవకాశాలు వస్తే వాటిని వదులుకోవద్దని అన్నారు. తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని చెప్పారు. సొంత ఊరు దాటితేనే.. భవిష్యత్తు బంగారం అవుతుందని మంత్రి సీతక్క తెలిపారు.
60 కంపెనీల ద్వారా 11వేల ఉద్యోగాలు: మంత్రి కొండా సురేఖ
60 కంపెనీల ద్వారా 11వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు తాము చెప్పామని.. అందులో భాగంగానే ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై పదేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహారించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 60వేల ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం.. అందుకే ఇలాంటి జాబ్‌మేళాను నిర్వహించామని తెలిపారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం దక్కుతుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..
NIT Student: పరీక్షలో తక్కువ మార్కులు..చివరకు ప్రాణమే తీసుకున్న యువకుడు
Read Latest Telangana News And Telugu News