Home » Congress 6 Gurantees
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.
: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడి కళ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్‌లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలపై బుధవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.