TG Politics: రుణమాఫీ కోసం కాంగ్రెస్ చేసేది ఇదే.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - May 18 , 2024 | 08:19 PM
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్: తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ...ఎన్డీఏ కూటమికి 400సీట్లు వచ్చే వాతావరణం ఉందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆరూరి రమేష్ ఎంపీగా గెలవబోతున్నారని తెలిపారు.
తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు. హమీలు నెరవేర్చలేని ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని విమర్శించారు.బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోని రుణ మాఫీకి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణను కాంగ్రెస్-బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. భవిష్యత్తులో తెలంగాణను రక్షించుకునే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి అండగా ఉండాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి
Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం
Read more Telagana News and Telugu News