Home » Congress Govt
ఓ ఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
మూసీ మురికిలో బతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు, నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి.. మిగిలిన 10 వేల ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మే కుట్ర చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్‌కార్డు కోసం పదేళ్లు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగారని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్‌కార్డు రాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని అన్నారు. కుటుంబ వ్యవహారాలు , వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు.
చై-సామ్ దంపతులపై మంత్రి కొండా సురేఖ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి కామెంట్లపై సినీ పరిశ్రమ స్పందించింది. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గారు. సమంత- అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్పారు. కేటీఆర్‌కు మాత్రం..
హైడ్రాకు ప్రత్యేక చట్టం కల్పించారు. మున్సిపల్ చట్టంలో 374 - బీ సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్ భవన్‌కు పంపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో మూసి పక్కన ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. ముకేష్ అంబానీ తలుచుకుంటే మధ్యతరగతి వారు తీసుకున్న లోన్లు మాఫీ చేయొచ్చని అన్నారు.