TG News: వీహెచ్ జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 26 , 2024 | 09:14 PM
కాంగ్రెస్ మాజీ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు నిరంతరం యువకులకు స్ఫూర్తిని ఇస్తాయని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రశంసించారు.
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ(శనివారం) ఢిల్లీ వేదికగా జరిగింది. ఈ పుస్తకాన్ని లోక్‌సభ మాజీ స్పీకర్ శ్రీమతి మీరాకుమార్ ఢిల్లీ వేదికగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు డి రాజా, కె నారాయణ, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కొప్పుల రాజు, తరిక్ అన్వర్, డీపీ యాదవ్, ఆసన్ హమ్మద్, పలువురు హాజరయ్యారు. అభినందన సందేశాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పంపించారు. హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు నిరంతరం యువకులకు స్ఫూర్తిని ఇస్తాయని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రశంసించారు.
ఈ పుస్తకం ఆ భ్రమలను తొలగిస్తుంది: మీరా కుమార్
హనుమంతరావు ఇంటికి వచ్చి మరి తనను పుస్తకావిష్కరణకు ఆహ్వానించారని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. వీహెచ్ తనకు సోదరుడి లాంటి వారని అన్నారు. వీహెచ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా తనను నియమించినప్పుడు అప్పుడు వీహెచ్ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తుచేశారు. 80 ఏళ్లు వచ్చిన వీహెచ్ ఇంకా యువకుడిగానే ఉన్నారని తెలిపారు. సమాజంలో పేదల ఉద్ధరణపై చాలా భ్రమలు ఉన్నాయని....ఈ పుస్తకం ఆ భ్రమలను తొలగిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వీహెచ్ లాంటి నేతలు కావాలని, నూరేళ్లు వీహెచ్ బతకాలని మీరా కుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వీహెచ్ సేవలను వినియోగించుకుటుంది: మహేష్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ వీహెచ్ సేవలను వినియోగించుకుటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయనకు పదవుల కంటే కూడా పేదల సమస్యల పరిష్కారం ముఖ్యమని చెప్పారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఆ సమయంలో వీహెచ్ ముఖ్యమంత్రి అయ్యే వారని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీహెచ్ లాంటి కార్యకర్త దొరకరని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
వీహెచ్ ముఖ్యమంత్రి అయ్యే వారు: నారాయణ
కాంగ్రెస్‌లో హనుమంతరావు సుధీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజీవ్ గాంధీ చనిపోకపోతే వీహెచ్ ముఖ్యమంత్రి అయ్యే వారని గుర్తుచేశారు. పార్టీకోసం కష్టపడి పని చేసే నాయకుడు వి.హనుమంతరావు అని నారాయణ కొనియాడారు.