Share News

Errabelli Dayakar Rao: రెండేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం

ABN , Publish Date - Oct 26 , 2024 | 10:05 PM

జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై బాంబులు వేస్తున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు విమర్శించారు. నీళ్లు లేక పాలకుర్తి తొర్రూర్ ఎడారిగా మారిందని మండిపడ్డారు. శ్రీనుకు మద్దతు ఇస్తున్నందుకే తనపై ఈడీ పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Errabelli Dayakar Rao: రెండేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం

జనగామ : రెండేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గిరిజన మహా ధర్నాలో మాజీ మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... లకవాత్ శ్రీనివాస్‌ది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. బీఆర్ఎస్ మీద కాదు బాంబులు. కాంగ్రెస్ మీద పడతాయని హెచ్చరించారు. మొన్ననే వచ్చిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు రగులుతున్నారని అన్నారు.


జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై బాంబులు వేస్తున్నారని విమర్శించారు. నీళ్లు లేక పాలకుర్తి తొర్రూర్ ఎడారిగా మారిందని మండిపడ్డారు. శ్రీనుకు మద్దతు ఇస్తున్నందుకే తనపై ఈడీ పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ, తులం బంగారం, కేసీఆర్ కిట్, రైతుబంధు హామీలు విస్మరించారని దుయ్యబట్టారు. సంవత్సరం కాలంగా మంత్రివర్గ విస్తరణ కాలేదని..గిరిజన బిడ్డ మంత్రివర్గంలో లేరని అన్నారు. రాష్ట్రంలో హోం మంత్రి లేరని.. రేవంత్ ఢిల్లీలో చెక్కర్లు కొడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేశారు.

Updated Date - Oct 26 , 2024 | 10:05 PM