Jagadish Reddy: కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేశారు... సీఎం రేవంత్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:58 PM
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్‌రెడ్డి చరిష్మా తెలుస్తుందని చెప్పారు.
సూర్యాపేట: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేశారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఏదో జరిగితే కేటీఆర్‌కి ఏం సంబంధమని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి ఆడుతున్ననాటకాలు ఇవే అని విమర్శించారు.
ఇవాళ(ఆదివారం) సూర్యాపేటలో జగదీష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్‌రెడ్డి చరిష్మా తెలుస్తుందని సవాల్ విసిరారు. దాడులు ఇలానే కొనసాగితే పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
ఉద్యోగులకు రిటైర్మెంట్ డబ్బులు చెల్లించాలి: హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన 6000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ డబ్బులు చెల్లించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మూడేళ్ల తర్వాతే చెల్లిస్తామని అనడం దుర్మార్గమని మండిపడ్డారు. సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమం ఇవాళ(ఆదివారం) జరిగింది.
ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం నిరాశపరిచిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 15 డీఏలను ఉద్యోగులకు ఇచ్చామని గుర్తుచేశారు. డీఏలు రెండు వస్తాయేమో అనుకుంటే.. కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 డీఏలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చామని హరీష్‌రావు స్పష్టం చేశారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీష్‌రావు పంపిణీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kishan Reddy: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
AV Ranganath: అనుమతులుంటే కూల్చం
KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
Read Latest Telangana News and Telugu News