Home » Covid-19
కొవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) సమయంలో వ్యాక్సిన్లు (Vaccines) ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలుసు. వైరస్ బారిన పడకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి.. ఆ వ్యాక్సిన్లు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే.. కొందరు అతి జాగ్రత్తకు పోయి రెండు డోస్‌లకు మించి ఎక్కువసార్లు టీకా వేయించుకున్నారు.
కోవిడ్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
భారతదేశం(india)లో గత 24 గంటల్లో 756 కొత్త కోవిడ్ 19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. దీంతోపాటు మరణాల సంఖ్య రెట్టింపు కావడంతో స్థానిక ప్రజలతోపాటు ఇతరుల్లో కూడా భయాందోళన మొదలైంది.
దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.
ఎందరో ఈ మహమ్మారికి బలయ్యేలా చేసింది. అప్పటి నుంచి ఏదో రూపంలో వేరియంట్లా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం COVID-19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్యుల ప్రకారం, విటమిన్ డి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటే కరోనా భయం తగ్గుతుందట.
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా(Corona Active Cases) క్రియాశీలకేసుల సంఖ్య పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసుల సంఖ్య పెరగడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు.
నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో...
దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.
అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.