Home » CPI
బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ప్రభు త్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ముసుగులో అమ్ముకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.
ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పీడ విరగడై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి దొరికిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు(Ramoji Rao) మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృంధం బుధవారం కలిసింది. కూటమి తరఫున 8 లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే స్థానం గెలవడం పట్ల రేవంత్‌కు బృందం అభినందనలు తెలిపింది.
పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.
పదేళ్లు పూర్తయినా రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న
ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.