Share News

Hyderabad: సీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ ప్రతినిధి బృందం

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:38 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృంధం బుధవారం కలిసింది. కూటమి తరఫున 8 లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే స్థానం గెలవడం పట్ల రేవంత్‌కు బృందం అభినందనలు తెలిపింది.

Hyderabad: సీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ ప్రతినిధి బృందం

హైదరాబాద్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృంధం బుధవారం కలిసింది. కూటమి తరఫున 8 లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే స్థానం గెలవడం పట్ల రేవంత్‌కు బృందం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని సూచించారు.


బాబు, నితీశ్‌ మద్దతే కీలకం

  • లేదంటే మోదీ ప్రధాని కాలేరు: నారాయణ

మోదీ ఎన్ని వేషాలు వేసినా బీజేపీ ప్రచారం చేసుకున్నట్లు 400 స్థానాలు సాధించలేకపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పారు. రామాలయం నిర్మించామని గొప్పగా ప్రచారం చేసుకున్నా.. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయిందని విమర్శించారు. జగన్‌ దుష్ట పాలన వల్లనే చంద్రబాబు గెలిచారని, పైగా అగ్గిలాంటి టీడీపీకి ఆజ్యం లాంటి పవన్‌ తోడయ్యారని వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక విధానాలు, నియంత పోకడలే జగన్‌ ఓటమికి కారణమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 03:38 AM