Share News

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:10 AM

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు(Ramoji Rao) మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు.

Ramoji Rao: రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

అమరావతి: ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasa Rao) తెలిపారు. తెలుగు జర్నలిజాన్ని ఓ మలుపు తిప్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందన్నారు. పత్రికను మారుమూల గ్రామాలకు సైతం చేర్చి స్థానిక వార్తలకు ప్రాధాన్యం కల్పించారని కొనియాడారు. ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధికి జర్నలిజం ద్వారా కృషి చేశారన్నారు.


రామోజీ ఫిలింసిటీ నిర్మించి సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చేసిన సమయంలో జరిగిన ప్రజాస్వామిక ఉద్యమానికి రామోజీరావు అండగా నిలిచారన్నారు.

సారా వ్యతిరేక ఉద్యమంలోనూ ముందు నిలిచారని, ఆయన మృతి తనకు తీరని లోటని పేర్కొన్నారు. కాగా ఇవాళ తెల్లవారు జామున గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రామోజీరావు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు దేశవిదేశాల నుంచి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 10:25 AM