Home » CPI
సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) అరెస్టు చేస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కూడా అరెస్టు చేయాలని సీపీఐ (CPI) తెలంగాణ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) డిమాండ్ చేశారు. ఎన్నికల వేళల్లో ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం మోదీకి ఆనవాయితీగా మారిందన్నారు.
విజయవాడ: మే 1వ తేదీన ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయని అందుచేత ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.
విజయవాడ: ఎన్డీఏతోనే వైసీపీ కాపురమంటూ మనసులో మర్మాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని జగన్‌కు ఇవాళ ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఇండియా కూటమి బలం మరింత పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరిన్నిసార్లు రాష్ట్ర పర్యటనకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్(CPI State Secretary Muttharasan) కోరారు.
Andhrapradesh: మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించటం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా... జగన్ అంటున్న 175 స్థానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గురువారం మీడియాతో సీపీఐ నేత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ఎదురు ఈదుతున్నారని.... జగన్ అంటున్న 175 స్థానాలు మైండ్ గేమ్ మాత్రమే అని స్పష్టం చేశారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.
Andhrapradesh: విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ పట్టుపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడటం ఆందోళనకరమన్నారు. పోర్టులు ప్రైవేటుపరం చేయటమే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.