AP Politics: జగన్ 175 స్థానాలపై రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 11 , 2024 | 12:15 PM
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా... జగన్ అంటున్న 175 స్థానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గురువారం మీడియాతో సీపీఐ నేత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ఎదురు ఈదుతున్నారని.... జగన్ అంటున్న 175 స్థానాలు మైండ్ గేమ్ మాత్రమే అని స్పష్టం చేశారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 11: ఏపీలో ఎన్నికలకు (AP Elections) సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పదే పదే చెబుతున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా... జగన్ అంటున్న 175 స్థానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గురువారం మీడియాతో సీపీఐ నేత మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ఎదురు ఈదుతున్నారని.... జగన్ అంటున్న 175 స్థానాలు మైండ్ గేమ్ మాత్రమే అని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో వైసీపీ పరిస్థితి బాగోలేదని.. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. జగన్‌తో సహా ఐదుగురు ముఠా సభ్యలు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. జగన్‌కు మోదీ సపోర్ట్ ఉందని.. ఏపీలో డీజీపీ పక్కా ఫెయిల్యూర్ అయ్యారంటూ రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
Anil Ambani: అప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యక్తి.. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పుల్లో...
జగన్, బాబు, పవన్‌పై ఇలా...
మోదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం అయిందని.. సర్వేలు కూడా అవే చెబుతున్నాయన్నారు. బీజేపీ 370 స్థానాలు గెలుస్తోందని మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. మోదీ ఫెయిల్యూర్ ప్రధాని అని అన్నారు. వ్యవస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని డిల్లీ సీఎం క్రేజీవాల్‌ను జైలులో పెట్టారన్నారు. ఏపీలో కోట్లాది రూపాయల లిక్కర్ స్కాం జరిగిందని పురంధేశ్వరి చెబుతున్నా ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. మోదీకి జగన్, బాబు, పవన్ తానా తందానా ఆడుతున్నారన్నారు. జైలులో పెడతారని రాష్ట్రంలో ఎవరూ మాట్లాడడం లేదని అన్నారు. మళ్ళీ మోదీ ప్రధాని అయితే... ప్రాంతీయ పార్టీలు దుకాణాలు బంద్ అవుతాయని... రాజ్యాంగం కూడా మారుస్తారని కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి భాగస్వామ్యంగా సీపీఐ గుంటూరు ఎంపీ, 8 అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తోందన్నారు. సీట్లు, ఓట్లు తమకు వచ్చినా రాకపోయినా.. తాము ప్రజల తరుపునే పోరాడుతామని రామకృష్ణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Elections 2024: ఇక మంచి రోజులు!
AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!
మరిన్ని ఏపీ వార్తల కోసం..