CPI: మన్యం స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించడంపై రామకృష్ణ ఫైర్
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:08 AM
Andhrapradesh: మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించటం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 12: మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి (Adani) ఏపీ ప్రభుత్వం (AP Government) అప్పగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించటం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు. 3400 మెగావాట్ల సామర్థ్యం గల 3 స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఆదానీ కంపెనీకి, 1000 మెగావాట్ల సామర్థ్యం గల మరో ప్రాజెక్టు జగన్ బినామీ కంపెనీ అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan: 17న బెంగళూరుకు పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలకు మద్దతుగా ప్రచారం
రెండు వేల ఎకరాలకు పైగా భూములను ఆదానీ, జగన్ బినామీ కంపెనీలకు కట్టబెట్టడం తగదన్నారు. ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరునిగానే పరిగణిస్తారనే సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం పక్కనపెట్టేసిందన్నారు. తక్షణమే మన్యం స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఒప్పందాన్ని రద్దు చేసి, గిరిజనులకే కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
కాగా... అల్లూరి జిల్లాలోని కొయ్యూరు మండలం ఎర్రవరంలో 1200 మెగావాట్లతో, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టిలో 1200 మెగావాట్లతో, కర్రివలసలో 1000 మెగావాట్లతో ఈ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను అదానీ పవర్ కంపెనీకి సర్కార్ కట్టబెట్టింది. అలాగే అనంతగిరి మండలం పెదకోటలో 1000 మెగావాట్లతో హైడ్రో పవర్ ప్రాజెక్టును షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
AP Election 2024: హారతి పడితే రూ.వెయ్యి..
Andhra Pradesh: జగన్.. ఈ పాపం ఎవరిది..? వైసీపీ పాలనలో సామాన్యుడి కష్టాలు..
మరిన్ని ఏపీ వార్తల కోసం...