CPI: మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి: రామకృష్ణ
ABN , Publish Date - Apr 26 , 2024 | 08:26 AM
విజయవాడ: మే 1వ తేదీన ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయని అందుచేత ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.
విజయవాడ: మే 1వ తేదీన ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి (Distribution of Social Pensions)చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI State Secretary) డిమాండ్ (Demand) చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయని అందుచేత ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ వల్ల వృద్ధులు నానా ఇబ్బందులు ఎదుర్కొని, మరణాలు సంభవించటం విచారకరమన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందిలతో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలన్నారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
కాగా ఎన్డీఏ (NDA)తోనే వైసీపీ (YCP) కాపురమంటూ మనసులో మర్మాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం (Visakha Steel Movement) జరుగుతున్నా పట్టించుకోని జగన్‌కు ఇవాళ ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న విషయం తెలియదనటం సీఎం పదవికే అవమానమన్నారు. జగన్, చంద్రబాబు (Chandrababu).. బీజేపీ (BJP) తానులో ముక్కలేనని.. వైసీపీ, టీడీపీ (TDP)లలో ఎవరిని గెలిపించినా బీజేపీ కుంపటి ప్రజల నెత్తిన పెట్టడం ఖాయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు..
ఎన్డీయేకే జగన్ జై!
విశాఖ స్టీల్‌ప్లాంటు కార్మిక సంఘాల నాయకులకు సీఎం జగన్ పెద్ద ఝలక్ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్ సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరగా, ఆయన విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 230-240 కంటే ఎక్కువ సీట్లు రాకూడదని ప్రార్థన చేయండి. అప్పుడు వైసీపీ మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’’ అని జగన్ సెలవిచ్చారు. తద్వారా కేంద్రంలో ఎన్డీయేకే తన మద్దతు ఉంటుందనే విషయాన్ని సూటిగా చెప్పేశారు. గత ఎన్నికల సమయంలో 25 ఎంపీ సీట్లు తనకు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తానని చెప్పిన జగన్, ఆ తర్వాత మాత్రం.. ‘దేవుడి దయ మనకు లేదు. కేంద్రంలో బీజేపీకి మన అవసరం లేకుండా పోయింది’ అని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పాట పాడటం గమనార్హం. తమ సమస్యలు పరిష్కరించాలని వచ్చిన ‘ఉక్కు’ కార్మికులతో.. ‘స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందా?’ అని చిత్రంగా ప్రశ్నించారు. వాస్తవానికి గత రెండ్రోజులుగా విశాఖ పర్యటనలో ఉన్న ఆయన, స్టీల్‌ప్లాంటు సమస్యపై గానీ, అదానీ గంగవరం పోర్టులో కార్మికుల సమ్మెపై గానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎన్నికల సమయం కావడం, స్టీల్‌ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు ఓట్లు కలిపి 50 వేలకుపైగా ఉండడం, ఇప్పుడు వారి సహకారం అవసరం కావడంతో వైసీపీ నాయకులు.....సీఎంతో భేటీకి ఉక్కు సంఘాల నాయకులకు అపాయింట్‌మెంట్ ఇప్పించారు. అన్ని కార్మిక సంఘాలకు చెందిన 20 మంది నాయకులు మంగళవారం ఉదయం ఎండాడలో బస వద్ద జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం పరిష్కరించదగిన సమస్యలనే వారు ప్రస్తావించారు. విజయనగరం జిల్లా గర్భాంలో మాంగనీస్ గనులను, పక్కనే సారిపల్లిలో ఇసుక గనుల లీజు కాలం ముగిసిపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని రెన్యువల్ చేయడం లేదు. వాటిని త్వరగా రెన్యువల్ చేయాలని నాయకులు కోరగా, వాటిని రెన్యువల్ చేయలేమని పరోక్షంగా స్పష్టంచేశారు. బొగ్గు కొరత వల్ల తాము ప్రతి నెల 80 కోట్ల నుంచి రూ.90 కోట్ల విద్యుత్ వినియోగిస్తున్నామని, అందుకు ఏ నెలకా నెల చెల్లించాలని ఈపీడీసీఎల్ నోటీసులు ఇస్తూ ఒత్తిడి పెడుతోందని, వాటిని వాయిదాలో చెల్లించడానికి అనుమతించాలని ఉక్కు నాయకులు కోరారు. దానికీ సీఎం నిరాకరించారు. ‘డిస్కమ్‌లకు రూ.లక్ష కోట్ల అప్పులు ఉన్నాయి. మీరు కాకపోతే బిల్లులు సకాలంలో ఇంకెవరు కడతారు?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయని, ఈ నెల 50 శాతం జీతాలే ఇచ్చారని, సంస్థ నష్టాల్లో ఉందని నాయకులు వివరించగా....జగన్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందా? అంటూ రెండు మూడుసార్లు రెట్టించి అడిగారు. దాంతో నాయకులు అవాక్కయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తరువాత వరుసగా నష్టాలు వస్తున్నాయనీ, ఇప్పటికి రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉంటే..ఆ విషయమే తెలియదన్నట్టుగా జగన్ మాట్లాడడం వారు జీర్ణించుకోలేకపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్
అనర్హత పిటిషన్లు స్పీకర్‌కు అందాయా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Sports News and Chitrajyothy