Home » CPM
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ కదన రంగంలో దూసుకెళ్తున్నాయి. సీపీఎం (CPM) పార్టీ కూడా ఈరోజు(సోమవారం) అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు సిద్ధమైంది. సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.
విజయవాడ: సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ భేటీలో పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌లో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రన్ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరిగా ఉన్న ఇబ్బంది లేదని.. కానీ బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగకూడదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు(Bv Raghavulu) అన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో ఉంటుందో ఆయన స్పష్టం చేయాలని అన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో ఉంటే బాగుండేదని తన అభిప్రాయం తెలిపారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు సమావేశమై చర్చిస్తారు. వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.
Andhrapradesh: ఏపీకి రాజధానిగా హైదరాబాద్న కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు.