CPM: వదిలేసిన హైదరాబాద్‌ను రాజధాని కావాలనడం ఏంటి?..
ABN , Publish Date - Feb 14 , 2024 | 11:35 AM
Andhrapradesh: ఏపీకి రాజధానిగా హైదరాబాద్‌న కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: ఏపీకి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbarreddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ అంశంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (CPM Leader V Srinivasrao) మాట్లాడుతూ.. రాజధానిపై వైసీపీ కావాలని కొత్త వివాదానికి తెరలేపుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వదిలేసిన హైదరాబాద్‌ను (Hyderabad) రాజధాని కావాలని వైసీపీ అనడం ఏమిటని ప్రశ్నించారు. హైదారాబాద్ రాజధానిపై సుబ్బారెడ్డి కాకతాళీయంగా చేసిన వ్యాఖ్యలు కావని.. సెంటిమెంట్‌ను జోడించి, వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు.
రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి జగన్‌కు (CM Jagan) ఉన్న అభ్యంతరం ఏమిటని నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా వట్టి బూటకమని సుబ్బారెడ్డి ప్రకటనతో అర్థం అయిపోయిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఒడించాలన్నారు. మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్న జగన్ వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏలో లేకపోయినా వైసీపీ అంతకన్నా ఎక్కువగా మోదీ ప్రభుత్వానికి జగన్ మద్దతు ఇస్తున్నారన్నారు. జగన్ కలిసనన్ని సార్లు మోదీని బీజేపీ సీఎంలు కూడా కలవలేదని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీకి ఓటు వేసినా అవి బీజేపీకే వెళ్తాయన్నారు. ఏపీలో 26 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని సీపీఎం నేత వి.శ్రీనివాసరావు వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..