Bv Raghavulu: కేసీఆర్ ఏ కూటమిలో ఉంటారో చెప్పాలి
ABN , Publish Date - Feb 23 , 2024 | 10:18 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరిగా ఉన్న ఇబ్బంది లేదని.. కానీ బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగకూడదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు(Bv Raghavulu) అన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో ఉంటుందో ఆయన స్పష్టం చేయాలని అన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో ఉంటే బాగుండేదని తన అభిప్రాయం తెలిపారు.
హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరిగా ఉన్న ఇబ్బంది లేదని.. కానీ బీజేపీతో పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగకూడదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు(Bv Raghavulu) అన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో ఉంటుందో ఆయన స్పష్టం చేయాలని అన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో ఉంటే బాగుండేదని తన అభిప్రాయం తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి నుంచి రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయాలని తాము భావిస్తున్నామని తెలిపారు. మిగతా స్థానాల్లో ఇండియా కూటమిలోని పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు.
కేంద్రం అన్యాయం చేసింది..
కేంద్రం పదేళ్లలో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన వాటాలను అమలు చేయకుండా ద్రోహం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పదేళ్లు చేసిన మోసంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకోవాలని కోరారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టం చేస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. స్వామినాథన్‌కు బిరుదులు ఇస్తారు కానీ... రైతులను అణిచివేస్తారని బీవీ రాఘవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.