Home » Cricket news
ఇంగ్లీష్ టీమ్‌ను తాజాగా వెస్టిండీస్ దెబ్బ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ సంచలన విజయం సాధించింది. లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఆతిథ్య జట్టు చావుదెబ్బ తీసింది.
భారత్ తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ కీలక వికెట్ కోల్పోయింది.
ఐపీఎల్ రిటెన్షన్ గురించి కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మళ్లీ తనను తీసుకోవడంపై ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే మూడేళ్లలో కచ్చితంగా జట్టుకు కప్పు అందిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. బెంగళూర్ అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు.
గత కొన్ని వారాలుగా వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. స్టార్ ప్లేయర్, గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)లను మాత్రమే యాజమాన్యం అట్టిపెట్టుకుంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి.
పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశపరిచిన స్కాట్లాండ్ నేపాల్ చేతిలో చిత్తైంది. 121 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థికి గెలుపును కట్టబెట్టింది.
హార్దిక్ పాండ్యా మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా బెస్ట్ అనిపించుకుంటున్నాడు. రానున్న రోజుల్లో నితీశ్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా తయారుచేయడంపై సెలక్టర్లు ఫోకస్ పెట్టారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో కీలక ఆటగాడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం తన రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేశాడు.
కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నిలుపుదల చేసుకుంటుందా లేదా అనే సందేహాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు జట్టును నడిపించడంలో కూడా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ విషయంలో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేయాలని పర్యాటక జట్టు కివీస్ ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు పడుతుంది. వివరాలు ఇవే