Home » Crime
తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్(Armstrong) చెన్నై పెరంబూర్లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు.
హత్రా్సలో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు రూ.100కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించిన కాం ట్రాక్టర్కు చెల్లించాల్సిన డబ్బుకు బదులు ఎరువుల లోడ్లు ఇస్తూ ఒక్కో లోడుకు రూ.లక్ష చొప్పున లంచం డిమాండ్ చేస్తున్న కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్రావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు.
‘నా క్టైంట్ దొంగతనాలు చేశాడు. అయితే ఉరి శిక్ష వేస్తారా? దోపిడీలు చేశాడు... అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’... అదేదో సినిమాలో కమెడియన్ లాయర్ తన క్లైంటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.
ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో (Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) తెలిపారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు తరచుగా అత్యాచారం చేసేవాడు. మరోసారి ఆ దారుణానికి పాల్పడుతుండగా.. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు ఇద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢికొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.