Home » CV Ananda Bose
అత్యాచారం, హత్య కేసుల్లో నిందితులకు మరణ శిక్ష విధించేలా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలనకు శుక్రవారంనాడు పంపారు. ఈ మేరకు రాజ్‌భవన్ మీడియా సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. బాధితులకు న్యాయం చేయాలంటూ అధికార, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్ కొలీజియం.. కలకత్తా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయించింది. హైకోర్టులో పని చేస్తున్న తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తుల పని వేళలను సైతం ఏడాదిపాటు పొడగించాలని సిఫార్సు చేసింది.
గవర్నర్ సీవీ ఆనంద బోస్పై(CV Anand Bose) ఎలాంటి పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేయరాదని కల్కత్తా హైకోర్టు(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సూచించింది. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చకూడదని కోర్టు పేర్కొంది.