Share News

Delhi: గవర్నర్‌‌ పరువు భంగం కలిగించొద్దు.. మమతా బెనర్జీకి హైకోర్టు సూచన

ABN , Publish Date - Jul 17 , 2024 | 08:00 AM

గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై(CV Anand Bose) ఎలాంటి పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేయరాదని కల్‌కత్తా హైకోర్టు(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సూచించింది. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చకూడదని కోర్టు పేర్కొంది.

Delhi: గవర్నర్‌‌ పరువు భంగం కలిగించొద్దు.. మమతా బెనర్జీకి హైకోర్టు సూచన

ఢిల్లీ: గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై(CV Anand Bose) ఎలాంటి పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేయరాదని కల్‌కత్తా హైకోర్టు(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సూచించింది. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చకూడదని కోర్టు పేర్కొంది. ఆగస్టు 14 వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. "మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేయకపోతే, ప్రతివాదికి వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయడం, ప్రతిష్టను దిగజార్చడం కొనసాగే ప్రమాదం ఉంది" అని కోర్టు పేర్కొంది.

బెనర్జీ తరపు న్యాయవాది సంజయ్ బసు మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్టు తెలిపారు.


రాజ్‌భవన్‌లో పని చేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగిని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై సంచలన ఆరోపణలు చేశారు. సీవీ ఆనంద్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో మే నెలలో కోల్‌కతా పోలీసులు గవర్నర్ పై దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ మహిళ సీఎంతో మాట్లాడారు. తర్వాత మమతా బెనర్జీ రాజ్‌భవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

మహిళలు రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారని దీదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ పరువు నష్టం దావా వేశారు. కొత్తగా ఎన్నికైన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో గందరగోళం నెలకొనడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని గవర్నర్‌ ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించని వారి నిర్ణయాన్ని ఆమె సమర్థించారు.


ఈ క్రమంలో గవర్నర్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, సీఎం మమతా బెనర్జీ ఆమె చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని, కేవలం ఆమెకు చెప్పిన మహిళల బాధను మాత్రమే ఆమె వ్యక్తపరిచారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అవసరమైతే బాధిత మహిళల పేర్లను కూడా అఫిడవిట్‌లో రాసి ఇస్తామని వివరించారు. గవర్నర్ పిటిషన్‌ను విచారించే పరిధి కలకత్తా హైకోర్టుకు లేదని సీఎం తరఫు న్యాయవాది వాదించారు. గవర్నర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని దీదీకి కోర్టు పరిమితులు విధించింది. సీఎంతోపాటు బారానగర్‌ ఎమ్మెల్యే సయంతిక బెనర్జీ, భగవంగోలా ఎమ్మెల్యే రేయత్ హోస్సేన్, టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ పేర్లను పిటిషన్లో పేర్కొన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 17 , 2024 | 08:01 AM