Share News

Kolkata Doctor Case: బెంగాల్ ఉక్కిరి.. బిక్కిరి.. రోడ్డెక్కిన అధికార, ప్రతిపక్షాలు..

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:50 PM

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్‌ అట్టుడుకుతోంది. బాధితులకు న్యాయం చేయాలంటూ అధికార, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి.

Kolkata Doctor Case: బెంగాల్ ఉక్కిరి.. బిక్కిరి.. రోడ్డెక్కిన అధికార, ప్రతిపక్షాలు..
West Bengal

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్‌ అట్టుడుకుతోంది. బాధితులకు న్యాయం చేయాలంటూ అధికార, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. ఘటనకు సీఎం మమత బెనర్జీ బాధ్యత వహించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంటే.. బెంగాల్‌లో విధ్వంసం వెనుక సీపీఎం, బీజేపీ ఉన్నాయంటూ బెంగాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు గత అర్ధరాత్రి ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.హాస్పటల్ ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్‌ స్టేషన్‌, మందుల స్టోర్‌, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విధులలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ నర్సులు ఆందోళన చేశారు. తాము చేస్తున్న ఆందోళనను నైతికంగా దెబ్బతీయడానికే ఆసుపత్రిపై దాడి చేశారని, అయితే న్యాయం కోసం తమ ఆందోళన కొనసాగుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.

Rain Alert: 25 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. 3 నెలల్లో విధ్వంసం..


యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన..

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆస్పత్రిలో జూనియర్ మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేయడంపై బెంగాల్ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని ఎక్కడికక్కడ సమ్మెలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారపక్షంతో పాటు.. ప్రతిపక్షాలు, వైద్యులు ఆందోళనబాట పట్టారు.


ప్రధాన డిమాండ్లు..

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరగాలనేది మొదటి డిమాండ్‌గా వినిపిస్తోంది. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించి ఈ విషయంలో సత్వరమే న్యాయం చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు సెంట్రల్ హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని తీసుకురావాని వైద్యులు కోరుతున్నారు.


ప్రతిపక్షాల రియాక్షన్..

కోల్‌కతా ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటనపై ప్రతిపక్షాలు మమత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. మమత ప్రభుత్వంపై బీజేపీ నిరంతరం నిరసనలు తెలుపుతోంది. మరోవైపు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఆస్పత్రిని ధ్వంసం చేశారని బెంగాల్ బీజేపీ అంటోంది. ఇక్కడ అక్కాచెల్లెళ్లు, కూతుళ్లకు భద్రత లేదని, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో కేంద్ర బలగాలను మోహరించాలని బిజెపి నాయకుడు సువేందు అధికారి కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా‌కు లేఖ రాశారు.


మమత వాదన ఇదే..!

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత మాట్లాడుతూ..తాను సీఎంగా విద్యార్థులను నిందిచడంలేదన్నారు. సీపీఎం, బీజేపీ కలిసి బెంగాల్లో విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలపిరు. జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు..

Congress : రాహుల్‌కు ఐదో వరుసలో సీటు


గవర్నర్ ఏమన్నారంటే..

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ బెంగాల్ లో జరిగిన ఘటన మానవత్వానికి సిగ్గుచేటని అభివర్ణించారు. గురువారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను విన్నది చూశానని చెప్పాడు. చట్టాన్ని కాపాడే వారే ఈ కుట్రలో భాగస్వాములయ్యారన్నారు. బెంగాల్‌లో తల్లులకు, కూతుళ్లకు రక్షణ లేదని, దీనికి మొదటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.


సీబీఐ దర్యాప్తు..

ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. గతంలో ఈ కేసును కోల్‌కతా పోలీసులు విచారించారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మొత్తం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కోల్‌కతా పోలీసుల నుంచి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించింది. బాధితురాలికి న్యాయం చేసేందుకు సీబీఐ మూడు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి, వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తోంది.

PM Modi : లౌకిక పౌరస్మృతి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 01:51 PM