Share News

CV Ananda Bose: 'అపరాజిత' బిల్లును రాష్ట్రపతికి పంపిన బెంగాల్ గవర్నర్

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:36 PM

అత్యాచారం, హత్య కేసుల్లో నిందితులకు మరణ శిక్ష విధించేలా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలనకు శుక్రవారంనాడు పంపారు. ఈ మేరకు రాజ్‌భవన్ మీడియా సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

CV Ananda Bose: 'అపరాజిత' బిల్లును రాష్ట్రపతికి పంపిన బెంగాల్ గవర్నర్

కోల్‌కతా: అత్యాచారం, హత్య కేసుల్లో నిందితులకు మరణ శిక్ష విధించేలా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత (Aparajita) బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ (CV Ananda Bose) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలనకు శుక్రవారంనాడు పంపారు. ఈ మేరకు రాజ్‌భవన్ మీడియా సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది.


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతవారంలో ''అపరాజిత మహిళ, శిశు (పశ్చిమబెంగాల్ క్రిమినల్ చట్టాల సవరణ) పేరుతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం దీనిని గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో మరో ట్విస్ట్.. గ్యాంగ్ రేప్‌పై సీబీఐ క్లారిటీ ఇచ్చిందా


కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రెయినీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, వైద్యుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ క్రమంలోనే అత్యాచార, హత్య నిందితులకు మరణశిక్ష విధించేలా అసెంబ్లీలో పది రోజుల్లోగా తీర్మానం చేస్తామని ప్రకటించిన మమతా బెనర్జీ ఆ గడువులోగానే సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం అసెంబ్లీ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించింది. బిల్లును పెండింగ్‌లో పెట్టకుండా గవర్నర్ సైతం హుందాగా దీనిని ఆమోదించాలని మమతా బెనర్జీ ఈ సందర్భంగా కోరారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..

Updated Date - Sep 06 , 2024 | 08:36 PM