Home » Cyclone Dana
దానా తుపాన్ శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో భారీగా వృక్షాలు నేలకూలాయి. ఇక ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ దాన.. శుక్రవారం తెల్లవారు జామున పూరి సమీపంలోని ధమ్రా- హబలి ఖాతి మధ్య ప్రాంతంలో తీరాన్ని దాటింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు తీరం దాటి సమయంలో వీస్తున్నాయి.
దానా తుపాన్ గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఒడిశాకు తుపాన్ తాకిడి అధికం. ఎప్పుడు తుపాన్ వచ్చిన.. తక్కువ ప్రాణ, ఆస్తి నష్టం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. తుపాన్ వచ్చిందంటే చాలు.. అంతకు ముందే ఒడిశా అప్రమత్తమవుతుంది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది.
దానా తుపాన్ ఒడిశాలో తీరం దాట నుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గురువారం అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తుపాన్ తీరం దాటుతుందన్నారు. దీంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాయ్యువ్య బంగాళాఖాతంలో ‘‘దానా’’ తీవ్ర తుఫానుగా మారింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు 260 కిలోమీటర్లు, ధమ్రా(ఒడిశా)కు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.
Andhrapradesh: దానా తుఫాను తీరం దాటే సమయం దగ్గర పడుతోంది. ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తుపాను తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ పలు హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య ఇది తీరం దాటనుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను భయపెడుతున్న ఈ తుపాను దానా అని పేరు ఎలా వచ్చింది. భారతదేశమే ఈ పేరు పెట్టిందా? లేక ఇతర దేశం ప్రతిపాదించిందా?.. దానా పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..
తూర్పుమధ్య బంగాళాఖాతంలో దానా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావం ఏపీపై తక్కువే అయినప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభావం కానున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.