ఒడిశాను వణికిస్తున్న తుఫాన్..!

ABN, Publish Date - Oct 24 , 2024 | 09:53 PM

దానా తుపాన్ గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఒడిశాకు తుపాన్ తాకిడి అధికం. ఎప్పుడు తుపాన్ వచ్చిన.. తక్కువ ప్రాణ, ఆస్తి నష్టం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది. తుపాన్ వచ్చిందంటే చాలు.. అంతకు ముందే ఒడిశా అప్రమత్తమవుతుంది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది.

1999లో ఒడిశాలో వచ్చిన తుపాన్‌కు ఆ రాష్ట్రం చిగురుటాకులా వణికింది. ఈ తుపాన్‌ వల్ల 10 వేల మంది విగత జీవులయ్యారు. నాడు జరిగిన నష్టం భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగా అడుగులు వేసిందీ. దీంతో తుపాన్ ఎప్పుడు వచ్చినా ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైపోతుంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 24 , 2024 | 09:53 PM