Share News

Dana Cyclone: తీరం దాటనున్న ‘దానా’.. అప్రమత్తంగా ఉండాలని సూచన

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:39 PM

దానా తుపాన్ ఒడిశాలో తీరం దాట నుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గురువారం అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తుపాన్ తీరం దాటుతుందన్నారు. దీంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Dana Cyclone: తీరం దాటనున్న ‘దానా’.. అప్రమత్తంగా ఉండాలని సూచన

అమరావతి, అక్టోబర్ 24: దానా తుపాన్ ఒడిశా తీరం దాటనుందని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సూచించారు. దానా తుపాన్‌ ప్రస్తుత పరిస్థితిపై గురువారం అమరావతిలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వాయువ్య బంగాళాఖాతంలోని దానా తీవ్ర తుపానుగా రూపు దాల్చిందని వాతావరణ శాఖ పేర్కొన్నట్లు తెలిపారు.

Also Read: Mumbai: ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడిన ‘ఆస్కార్’

Also Read: TS Politics: గాదరి కిషోర్‌పై మందుల సామేల్ విసుర్లు


ఒడిశాలోని పారాదీప్‌కి 180 కి.మీ, ధమ్రాకు 210 కి.మీ. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 270 కి.మీ దూరంలో ఈ తుపాన్ కేంద్రీకృతమైందని ఆయన వివరించారు. ఆరు గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతు ఉత్తర-వాయువ్య దిశగా గురువారం అంటే అక్టోబర్24వ తేదీ అర్ధరాత్రి నుంచి శుక్రవారం అంటే అక్టోబర్25వ తేదీ ఉదయం లోపు పూరీ - సాగర్ ద్వీపం మధ్య భిటర్కానికా, ఒడిశాలోని ధమ్రా సమీపంలో దానా తీరం దాటే అవకాశం ఉందన్నారు.

Also Read: Baramati: పెద్దనాన్న వర్సెస్ అబ్బాయి

Also Read:TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..


తుపాన్ తీరం దాటే వేళ.. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సూచించారు.

Also Read: Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Oct 24 , 2024 | 09:39 PM