Home » Damodara Rajanarasimha
నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ (జూడా)లతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈ డాక్టర్ వాణి జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయని జూడాలు ప్రకటించారు.
మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Raja Narasimha) జూనియర్ డాక్టర్లు నేడు(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జూడాలు పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
తెలంగాణ(Telangana)లోని ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల (Private Medical Colleges) యాజమాన్యం, డీన్లు, ప్రిన్సిపాల్స్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంత్రి వివరించారు.
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయడానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవలే కొత్తగా ఉద్యోగాలు సాధించిన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సోమవారం మంత్రి నియామక పత్రాలను అందజేశారు.
సంగారెడ్డి జిల్లా అందోల్‌లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.
సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మాతాశిశు సంరక్షణకు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పేరును ఇప్పటికే రేవంత్ సర్కారు తొలగించింది. దాని స్థానంలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) కిట్ పేరుతో అమలు చేస్తోంది. అంతేకాక ఈ పథకం రూపురేఖల్ని పూర్తిగా మార్చేయబోతోంది.