Home » Danam Nagender
ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేడు ఆయన కాసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారు. ఇద్దరి ముగ్గురి ట్యాపింగ్‌పై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. రేవంత్ జీవితమంతా కాంగ్రెస్‌లోనే ఉంటానని ఏనాడు చెప్పడం లేదన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... రూ. 2500 కోట్లను ఢిల్లీకి రేవంత్‌రెడ్డి పంపించారని ఆరోపించారు.
Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.
గ్రేటర్ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్ టికెట్‌ను దానం నాగేందర్(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్‌పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పుతో పోయిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (Rammohan Reddy) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ (PM Modi) జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాట్లాడడం దుర్మార్గమని అన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చిల్లర పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసివి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు బీఆర్ఎస్ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.