Danam Nagender: త్వరలో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం... దానం షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:41 PM
Telangana: త్వరలో బీఆర్ఎస్ఎల్పీ.. కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
హైదరాబాద్, జూలై 12: త్వరలో బీఆర్ఎస్ఎల్పీ (BRSLP).. కాంగ్రెస్‌లో(Congress) విలీనం కాబోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan: అన్ని అనర్ధాలకు ఆ ఐఏఎసే కారణం..
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ (KTR) కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని విమర్శించారు. కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒకవేల దొరికినా, గంటల తరబడి వెయిట్ చేయించేవారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్‌పై నమ్మకం లేకనే ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారన్నారు. విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్‌లో చేరుతున్నారని వెల్లడించారు.
Uttarakhand: బద్రీనాథ్ హైవే మూసివేత..
కాంగ్రెస్‌లో అందరికి విలువ ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న వారి వివరాలు త్వరలో బయట పెడతానన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నారని... త్వరలో సాక్షాలతో బయటపెడుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీరం చూపిస్తున్నారన్నారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Tirumala: తిరుమలలో మహిళకు ఊహించని ఘటన..
Read Latest Telangana News And Telugu News