Share News

Danam Nagender: నా సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎలా అంటారు..?

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:51 PM

బీజేపీఎల్పీ నేత మహేశ్వర రెడ్డిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సభ్యత్వం రద్దు చేయమని అడిగే అధికారం ఆయనకు లేదన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మహేశ్వర రెడ్డి ఈ రోజు కలిశారు. పార్టీ మారిన దానం నాగేందర్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై దానం నాగేందర్ మాట్లాడుతూ.. తన సభ్యత్వం గురించి మాట్లాడే హక్కు మహేశ్వర రెడ్డికి లేదన్నారు.

Danam Nagender: నా సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎలా అంటారు..?
Danam Nagender

హైదరాబాద్: బీజేపీఎల్పీ నేత మహేశ్వర రెడ్డిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సభ్యత్వం రద్దు చేయమని అడిగే అధికారం ఆయనకు లేదన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మహేశ్వర రెడ్డి ఈ రోజు కలిశారు. పార్టీ మారిన దానం నాగేందర్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై దానం నాగేందర్ మాట్లాడుతూ.. తన సభ్యత్వం గురించి మాట్లాడే హక్కు మహేశ్వర రెడ్డికి లేదన్నారు. ఏ హోదాతో తన సభ్యత్వం రద్దు గురించి అడిగారని ప్రశ్నించారు. పార్టీ మారడం అనే విషయం దేశంలో కొత్త కాదని గుర్తుచేశారు. తన సభ్యత్వం గురించి హైకోర్టులో కేసు ఉందని గుర్తుచేశారు.


అంతర్గత ఒప్పందం

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ- బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందని దానం నాగేందర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి ఒప్పందం ఉందని.. అందుకే ఆ మాత్రం సీట్లు గెలిచిందన్నారు. లేదంటే రెండు సీట్లు కూడా రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ 8 లోక్ సభ సీట్లు గెలిచింది. గతంలో 4 గెలువగా.. ఈ సారి రెట్టింపు స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీతో అంతర్గత ఒప్పందం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో ఉంది. మరి తమ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్, బీజేపీ పడగొడతాయని అంటున్నాయి.. ఎలా సర్కార్‌ను కూలుస్తారని నిలదీశారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అర్థం అయ్యిందని వివరించారు.

Updated Date - Jul 01 , 2024 | 06:52 PM