Share News

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

ABN , Publish Date - May 01 , 2024 | 12:56 PM

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagendhar) తెలిపారు.

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

  • కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌

హైదరాబాద్: సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagendhar) తెలిపారు. బుధవారం ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా బాకారం బొమ్మలగుడిలో పూజలు చేసి జీపు యాత్ర చేస్తూ పలు బస్తీల్లో ఓటర్లను కలిసి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. రిసాలగడ్డ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై నమ్మకంతో సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సికింద్రాబాద్‌లో గెలిచి కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తానన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపునకు దోహదపడతాయని అన్నారు. అంజన్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎ్‌సల మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం పాటుపడే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు దానంకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ప్రచారంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం. అరవింద్‌కుమార్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు ఆర్‌. కల్పనా యాదవ్‌, వాజిద్‌ హుస్సేన్‌, రాంనగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ జుహేర్‌ హుస్సేన్‌, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిలు కె. గౌరీశంకర్‌, పొన్నాడ సుబ్రహ్మణ్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Loksabha polls 2024: సోషల్ మీడియాలో దుష్ర్పచారం.. బీజేపీపై ఈసీకి ఫిర్యాదు: హరీష్‌రావు

సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ విజయం ఖాయం

సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్‌ అన్నారు. బుధవారం సతన్‌నగర్‌ డివిజన్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. మతతత్వ బీజేపీ, అవినీతి బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయాంలో పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, నిరుద్యోగం గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిందన్నారు. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తానన్న బీజేపీ రైతు చట్టాలు తీసుకువచ్చి వారిని మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సనత్‌నగర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కోట నీలిమ, డాక్టర్‌ రవీందర్‌గౌడ్‌, డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఓయో లాడ్జికి ప్రేమికుల జంట.. సడెన్‌గా ప్రియుడి మృతి.. అసలేం జరిగిందంటే..

బీఆర్‌ఎస్‏లో స్వేచ్ఛ కోల్పోయా

బీఆర్‌ఎ్‌సలో ఉండగా కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయానని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్ధి దానం నాగేందర్‌ అన్నారు. ఫిలింనగర్‌ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావు ఆధ్వర్యంలో పలు బస్తీలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, దీపా, గోపాల్‌నాయక్‌తో పాటు సుమారు మూడు వందల మంది దానం సమక్షంలో బుధవారం కాంగ్రెస్ లో చేరారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‏లో ఉండగా స్వేచ్ఛ కోల్పోయినట్టు చెప్పారు. ఏడున్నర సంవత్సరాల వ్యవధిలో కేసీఆర్‌ను కలిసింది ఐదుసార్లు మాత్రమేనని, కేటీఆర్‌ను కలిసింది కూడా తక్కువేనని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ పదవులు కూడా ఇప్పించలేని పరిస్థితులు ఎదుర్కొన్నట్టు వివరించారు. కాంగ్రెస్‏లో చేరిన తర్వాత స్వేచ్ఛ లభించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకే తాను పార్టీలో చేరినట్టు చెప్పారు. ఢిల్లీలో సోనియాగాంధీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందడంతో ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. కష్టపడే వారికి గుర్తింపు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావుకు కార్పొరేషన్‌ లేదా ఎమ్మెల్సీ పదవి ఇప్పించనున్నట్టు ప్రకటించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కడకు వెళ్లినా తనకు ఆదరణ లభిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తానని దానం ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి: Etala Rajender: రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప నిధులు లేవు..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 12:56 PM