Home » Delhi High Court
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
‘కరోనిల్’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ , ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌కు(CM Arvind Kejriwal) ఊరట దక్కలేని విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.
తన బెయిల్‌పై డిల్లీ హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌కు ఊరట మాత్రం దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.
లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.