Augusta Westland Chopper Scam: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు.. క్రిస్టియన్ మైఖేల్‌కు హైకోర్టు బెయిలు
ABN , Publish Date - Mar 04 , 2025 | 08:58 PM
మనీలాండిరింగ్ కేసులో బెయిలు కోరుతూ జేమ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఫిబ్రవరి 28న రిజర్వ్ చేశారు. తాజాగా బెయిలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు.

న్యూఢిల్లీ: రూ.3600 కోట్ల విలువైన అగస్టా వెస్ట్‌ల్యాండ్ (Augusta Westland) కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ (Christian Michel James)కు ఉపశమనం కలిగింది. ఇందుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మంగళవారంనాడు బెయిలు (Bail) మంజూరు చేసింది. ఇప్పటికే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో క్రిస్డియన్ మైఖేల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. మనీలాండిరింగ్ కేసులో బెయిలు కోరుతూ జేమ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఫిబ్రవరి 28న రిజర్వ్ చేశారు. తాజాగా బెయిలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు.
Nitish Kumar: లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్
యూపీఏ హయాంలో రూ.3,600 కోట్ల మేరకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ మనీలాండరింగ్ కేసు వెలుగు చూడటం సంచలనమైంది. ఇటాలియన్ మాన్యుఫ్యాక్టరింగ్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ నుంచి 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి కేసు ఇది. కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. మధ్యవర్తిగా వ్యవహరించి మైఖేల్ రూ.225 కోట్లు అందుకున్నారన్న ఆరోపణలు ఉ్ననాయి. దీంతో 2016లో సీబీఐ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసింది. దుబాయ్ నుంచి ఆయనను భారత్‌కు రప్పించడంతో 2018లో సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
బ్రిటిష్ పౌరుడైన మైఖేల్‌కు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెయిల్ మంజూరు చేయరాదని ఈడీ తరఫు న్యాయవాది వాదించగా, ఈ కేసులో గరిష్ట శిక్ష ఏడేళ్లు కాగా, ఇప్పటికే మైఖేల్ ఆరేళ్లకు పైగా జైలులో ఉన్నందున బెయిలుపై విడుదల చేయాలని ఆయన తరఫు లాయర్ వాదించారు.
ఇవి కూడా చదవండి
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.