RBI Rules: కాలిన నోట్లను బ్యాంకులో తీసుకుంటారా.. క్యాష్ ఛేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి..
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:19 PM
RBI Rules: కొన్నిసార్లు ఊహించనివిధంగా అగ్నిప్రమాదాల సంభవించి ఇళ్లు, ఆఫీసుల్లో భద్రపరచుకున్న నోట్ల కట్టలు కాలిపోవచ్చు. ఒకటి రెండు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోతే అప్పుడేం చేయాలి.. సగం కాలిన నోట్ల కట్టలను బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి క్యాష్ ఇస్తారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రూల్స్ ఏం చెబుతున్నాయి.

RBI Rules For Burned and Damages Currency: సగం కాలిన, పూర్తిగా డ్యామేజ్ అయిన నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉంటుందా.. ఇటీవల ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంటి దగ్గర భారీ మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించిన తర్వాత చాలామందిలో రేకెత్తిన ప్రశ్న ఇది. ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్లు పోలీసుల చేతికి చిక్కడతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోల్లో నోట్లు పూర్తిగా బూడిదగా మారిపోవడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన తర్వాత మన దగ్గర పాతవి, చిరిగిన లేదా తగలబడిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చా? ఎంత వరకూ మార్చుకునే అవకాశముంది? అనే అనుమానాలు చాలామంది బుర్రలను తొలిచేస్తున్నాయి.
ఎక్కడ మార్చుకోవాలి.. ఎంతిస్తారు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల మార్పిడి విషయంలో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా బ్యాంకులు చిరిగిన లేదా పాత నోట్లను తిరిగి తీసుకొని కొత్త నోట్లను ఇస్తాయి. అది ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేట్ బ్యాంకైనా నోటు స్పష్టంగా గుర్తించదగిన స్థితిలో ఉంటే వాటిని తప్పక మార్చుకోవచ్చు. ఒకవేళ నోటు పూర్తిగా కాలిపోయిన లేదా గుర్తించలేనంతగా పాడైపోతే వాటిని RBI ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్‌లలో మాత్రమే మార్చుకోవాలి. అలాగే నోటుపై రాజకీయ నినాదాలు లేదా అనుచిత పదాలు రాసి ఉంటే అలాంటి నోట్లు చెల్లుబాటు కావు.
నోటు సగానికి మించి కాలిపోతే..
ఒక నోటు సగానికి మించకుండా కాలిపోయి ఉంటే బ్యాంకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అదే నోటు తీవ్రంగా పాడైపోయినప్పుడు బ్యాంకు తనిఖీ చేసినా ఒక్కసారిగా మొత్తం క్యాష్ ఇవ్వదు. వాటిని RBI ఆఫీస్‌కి పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే కొంత శాతం నగదుగా ఇస్తారు. ఉదాహరణకి రూ.500 నోటు చాలావరకు కాలిపోతే దానికి పూర్తి మొత్తం కాకుండా రూ.300 అలా ఇవ్వవచ్చు.
ఒకసారికి ఎన్ని నోట్లు..
ఒకసారి గరిష్ఠంగా 20 నోట్ల వరకే మార్పిడి చేయవచ్చు. అదీ రూ.5000 మొత్తాన్ని మించకూడదు. అంతకన్నా ఎక్కువ విలువ ఉన్న నోట్లు ఉంటే బ్రాంచ్ మేనేజర్‌కు ముందుగానే రాతపూర్వకంగా తెలియజేయాలి. మేనేజర్ ఆమోదించిన తర్వాతే అటువంటి నోట్ల మార్పిడి సాధ్యమవుతుంది.
బ్యాంకులు నోట్లు తీసుకోకపోతే ఏం చేయాలి..
ఒకవేళ బ్యాంక్ మార్పిడి చేసుకునేందుకు నిరాకరిస్తే RBI ప్రత్యేక హెల్ప్‌లైన్‌కు కస్టమర్ ఫిర్యాదు చేయవచ్చు. 14440 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు లేదా crpc@rbi.org.in కి మెయిల్ చేయొచ్చు. ఇవే కాకుండా RBI వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయొచ్చు.
Read Also : Bank Holiday Cancel: ఈరోజున బ్యాంక్ సెలవు రద్దు.. ఆదివారం కూడా ఈ ఆఫీసులు
DA Hike 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన
Stock Market Update: ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు