Home » Deputy CM Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు.
పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలని, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఎంతోమంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావడంతో ప్రజలు ఎంచుకున్న ప్రజా పరిపాలన మొదలైందని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti AppalaNaidu) తెలిపారు.
జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంబంధింత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ప్రణాళిక బద్దంగా తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ ప్రాంతం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భూ ముల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న,మొన్నటివరకూ ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తే చాలు అనుకున్న వారే రాత్రికి రాత్రి మనస్సు మార్చేసుకున్నారు. మేము చెప్పిన ధర ఇస్తేనే అమ్ము తామంటున్నా రు. ఇదంతా పవన్‌కల్యాణ్ తన సొంతిల్లు, కార్యాలయం నిర్మాణం కో సం భూములు కొన్న ఫలితం. ఒక్కసారి రియల్ జోరు ప్రారంభ మైంది. ఒక స్థలమైనా కొనే ప్రయత్నాల్లో జనసైనికులు ఉన్నారు.
ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ దీక్షలో భాగంగా సూర్యారాధన చేశారు.
జగన్ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి ఆస్కారమున్న ప్రతిచోటా కోట్లకు కోట్లు దోచేశారు.