Share News

Pawan Kalyan: వరద పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఫోన్

ABN , Publish Date - Sep 11 , 2024 | 10:29 AM

Andhrapradesh: ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు.

Pawan Kalyan: వరద పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఫోన్
Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 11: ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆరా తీశారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు.

Godavari: గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న వరద ప్రవాహం..


గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం - రాపర్తి, పెద్దాపురం - గుడివాడ, సామర్లకోట - పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయన్నారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు వెల్లడించారు. వరద బారిన పడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు 12,567 క్యూసెక్కుల ఇన్ఫ్ ఫ్లో కి వచ్చేసిందని తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.16 టీఎంసీలు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

CM Chandrababu: దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి..


అంచనాలకు మించి వరద...

కాగా... ఏలేరు రిజర్వాయరుకు గంటగంటకూ అంచనాలకు అందనంత రీతిలో వరద పోటెత్తుతోంది. ఎగువన క్యాచ్‌మెంట్‌ ఏరియా అయిన ఏజెన్సీలో వర్షాలు భారీగా కురుస్తుండడంతో వేల క్యూసె క్కుల వరద రిజర్వాయరును ముంచెత్తుతోంది. గంటగంటకు ప్రవాహ ఉధృతి పెరిగిపోతోంది. గడిచిన నాలుగున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో వరద ఏలేరును చుట్టుముడుతోంది. గతంలో 2013, 2019, 2020ల్లో ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల నుంచి 48 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయికి మించి వరద పోటెత్తుతుండంతో దిగువకు వరద నీటిని వదిలేస్తున్నారు. అయి తే ఊహించని వరద కాలువలను ముంచేస్తుండడంతో ఎక్కడికక్కడ కాలువలకు భారీగా గండ్లు పడుతున్నాయి. అనేక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.


ఇవి కూడా చదవండి..

YS Jagan: ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు వైఎస్ జగన్.. ఎందుకంటే?

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Read LatestAP NewsAndTelugu news

Updated Date - Sep 11 , 2024 | 10:39 AM