Share News

MP Balasouri: ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Sep 09 , 2024 | 08:57 PM

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు లక్ష చొప్పున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారని ఎంపీ బాలశౌరి(MP Balasouri) తెలిపారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో 17 గ్రామపంచాయతీలకు ఈరోజు(సోమవారం) చెక్కులు పంపిణీ చేశారు.

MP  Balasouri: ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్
MP Vallabhaneni Balasouri

విజయవాడ: వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు లక్ష చొప్పున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారని ఎంపీ బాలశౌరి (MP Balasouri) తెలిపారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో 17 గ్రామపంచాయతీలకు ఈరోజు(సోమవారం) చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బొలిశెట్టి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ALSO READ: Minister Narayana: శానిటేషన్‌పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ... ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. 400 గ్రామపంచాయతీలకు కలిపి రూ.4 కోట్లు ఇవ్వడం చిన్న విషయం కాదని అన్నారు. వరద భాదితులు కోసం సొంత నిధులు కేటాయించిన పవన్ కళ్యాణ్‌కు యార్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.


ప్రజలు, రాష్ట్రం కోసం తపన పడే వ్యక్తి పవన్: అమ్మిశెట్టి వాసు

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారని.. ఆ మాట కోసం పని చేసిన నేత పవన్ అని జనసేన నేత అమ్మిశెట్టి వాసు కొనియాడారు. ప్రజలు, రాష్ట్రం కోసం నిత్యం తపన పడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు.


ALSO READ: Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

మచిలీపట్నంలో చెక్కుల పంపిణీ

కృష్ణా,(అవనిగడ్డ): వరదలతో నష్టపోయిన మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోని 9 గ్రామ పంచాయతీలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరుపున లక్ష రూపాయల చెక్కులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అందజేశారు. వరద ప్రభావిత పంచాయతీలకు రూ. లక్ష చొప్పున విరాళం ప్రకటించి పవన్ కళ్యాణ్ మంచి మనస్సు చాటుకున్నారని అన్నారు. అవనిగడ్డలో పంచాయతీ సర్పంచ్‌లకు పవన్ కళ్యాణ్ తరుపున చెక్కులు అందజేశారు. పవన్ కళ్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని సర్పంచ్‌లు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు.


ALSO READ: Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరని స్పష్టం చేశారు. ప్రజా స్వామ్యంలో ప్రజలు నియంతలను కాలగర్భంలో కలిపిన సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. జగన్ చేస్తున్న నీచ రాజకీయాలకు.. ప్రజలు ఈసారి తరిమి కొడతారని అమ్మిశెట్టి వాసు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: ప్రజల కోసమే నా జీవితం అంకితం

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 09 , 2024 | 10:11 PM