Home » Devotees
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.
భక్తుల మొరను ఆ భద్రాద్రి రాములోరు ఆలకించినట్టు ఉన్నారు. మంగళవారం పొద్దుపోయే వరకు రాములోరి కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారం అంశంపై ఈసీ స్పష్టత ఇవ్వలేదు. కాసేపటి క్రితం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో హిందువులు, రామ భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీరామ నవమి పర్వదినం రోజున భద్రాచలంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వైకుంఠం నుంచి కొలువుదీరిన చతుర్భుజ రామునిగా భద్రాద్రి రామునికి పేరు ఉంది. వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. రాముడితో తెలుగు నేలకు విశేష అనుబంధం ఉంది. ఆ పేరు చెబితే చాలు తెలుగు లోగిళ్లు పులకిస్తాయి. భక్తితో నమస్కరిస్తాయి.
సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, రాజుల కాలం నాటి రాజస కట్టడాలు, శత్రు దుర్భేధ్యమైన కోటలు, ప్రశాంత సముద్ర తీరాలు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి చాలా ఉన్నాయి.
అమర్నాథ్ వార్షిక యాత్ర(Amarnath Yatra 2024) జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు వెల్లడించింది.
రాజస్థాన్లోని ఓ గుడి నిర్మాణానికి 40 వేల కిలోల నెయ్యి వాడారు. దానికీ ఓ పెద్ద కారణం ఉంది. బికనీర్ నడిబొడ్డున ఆధ్యాత్మికత, శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది భండాసర్ జైన దేవాలయం(Bhandasar Jain Temple). ఐదవ తీర్థంకరుడైన సుమతినాథకు అంకితం చేసిన ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.
నేడు దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ(Baisakhi festival)ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సిక్కు మతంతో పాటు హిందూ మతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే గురుద్వార వద్దకు భక్తుల(devotees) రాక మొదలైంది.
ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి(Sita Ramachandra Swamy Temple) బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ భద్రాచలంలోని రాములోరి ఆలయంలో శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఆన్లైన్(online)లో కూడా గదులు బుక్ చేసుకోవచ్చని(bookings) అధికారులు ప్రకటించారు.
నేడు ( 10-4-2024 - బుధవారం) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్ఫండ్లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు....