Share News

Horoscope Today: ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూల పరిస్థితులు..

ABN , Publish Date - Apr 10 , 2024 | 07:22 AM

నేడు ( 10-4-2024 - బుధవారం) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్‌ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు....

Horoscope Today: ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూల పరిస్థితులు..
Horoscope Today

నేడు ( 10-4-2024 - బుధవారం) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్‌ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు....

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) : ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్‌ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) : కొత్త పరిచయాలు లాభిస్తాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సౌకర్యాలు గురించి ఆలోచిస్తారు. సంకల్పం ఫలిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) : దూరంలో వుండే బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. గణపతి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) : ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. బ్యాంకులతో లావాదేవీలకు అనుకూలం. యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఊరేగింపులు, ప్రదర్శనల్లో కీలకపాత్ర పోషిస్తారు. వేడుకల్లో ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) : రాజకీయ రంగంలోని వారు ఉన్నత పదవులు అందుకుంటారు. కన్సల్టెన్సీ, రవాణా, బోధన, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రమోషన్లు, గౌరవ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) : కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. సమావేశాలు, వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. చర్చలు, ప్రయాణాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) : సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, మెడికల్‌ క్లెయిములకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను సమీక్షించుకుంటారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) : సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) : సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, డెయిరీ రంగాల వారు సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నారులు, ప్రియతములతో విందుల్లో పాల్గొంటారు. రామాలయాన్ని దర్శించండి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) : క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. చిన్నారులు, విద్యార్థుకు శుభప్రదం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. పెట్టుబడలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. గణపతిని ఆరాధించండి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) : రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి అనుకూలం. ఇల్లు, స్థలం మార్పునకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఇంటికి అ వసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. అన్నదమ్ముల వైఖరిలో మార్పు గమనిస్తారు.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) : పాఠశాలలు, మార్కెటింగ్‌, ట్రెయినింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, స్టేషనరీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫీజులు చెల్లించేందుకు అ వసరమైన నిధులు సమకూర్చుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విలువైన పత్రాలు అందుకుంటారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Apr 10 , 2024 | 07:32 AM