Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామ నవమికి..ఆన్‌లైన్‌లో రూమ్స్ బుకింగ్ షురూ
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:49 PM
ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి(Sita Ramachandra Swamy Temple) బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ భద్రాచలంలోని రాములోరి ఆలయంలో శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఆన్‌లైన్(online)లో కూడా గదులు బుక్ చేసుకోవచ్చని(bookings) అధికారులు ప్రకటించారు.
ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి(Sita Ramachandra Swamy Temple) బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ భద్రాచలంలోని రాములోరి ఆలయంలో శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 17న శ్రీరామనవమి(sri rama navami) వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల కోసం తరలిరానున్నాయి. ఇప్పటికే భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఆలయ పరిసరాలలో తాగు నీరు సహా భక్తుల కోసం గదులను(Rooms) కూడా సిద్ధం చేశారు.
ఈ క్రమంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఆన్‌లైన్(online)లో కూడా గదులు బుక్ చేసుకోవచ్చని(bookings) అధికారులు ప్రకటించారు. అందుకోసం ఈ వెబ్‌సైట్ ద్వారా https: //book.bhadrachalamonline.com/book-hotel బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏప్రిల్ 17, 18 తేదీలలో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆయా తేదీలలో రూమ్స్ కోసం ముందుగానే బుక్ చేసుకుంటే సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. రూముల గురించి మరింత సమాచారం కోసం వెబ్‌సైట్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
TS Govt: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ వాదనలివే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం