Home » Dr. Tamilisai Soundararajan
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు.
ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడం.. కొంత సమయం కావాలనడంపై టీఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది.
హైదరాబాద్: ఆర్టీసీ (RTC) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై సంతకం చేసేందుకు మరింత సమయం కావాలని గవర్నర్ తమిళి సై అన్నారు. న్యాయ పరమైన అంశాలు పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ పేర్కొంటూ ఈ మేరకు మీడియా నోట్ విడుదల చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని వీసీని గవర్నర్ ఆదేశించారు. ఇద్దరు విద్యార్థినులు కూడా ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత(17) హాస్టల్ భవనం నాలుగో అంతస్థు నుంచి కింద పడింది. ట్రిపుల్ ఐటీ సిబ్బంది వెంటనే ఆమెను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లిఖిత మృతి చెందింది.
బ్లడ్ డోనర్ డే సందర్భంగా రాజ్‌భవన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించారు. బ్లాడ్ డొనేషన్ క్యాంప్‌లో రెడ్ క్రాస్ సొసైటీ అధికారులు, పలువురు ప్రముఖులు, రక్త దాతలు పాల్గొన్నారు.
అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి గవర్నర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.