Tamilisai soundararajan: బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించిన గవర్నర్

ABN , First Publish Date - 2023-06-14T13:21:34+05:30 IST

బ్లడ్ డోనర్ డే సందర్భంగా రాజ్‌భవన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించారు. బ్లాడ్ డొనేషన్ క్యాంప్‌లో రెడ్ క్రాస్ సొసైటీ అధికారులు, పలువురు ప్రముఖులు, రక్త దాతలు పాల్గొన్నారు.

Tamilisai soundararajan: బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించిన గవర్నర్

హైదరాబాద్: బ్లడ్ డోనర్ డే సందర్భంగా రాజ్‌భవన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను నిర్వహించారు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ (Governor Tamilisai soundararajan) ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించారు. బ్లాడ్ డొనేషన్ క్యాంప్‌లో రెడ్ క్రాస్ సొసైటీ అధికారులు, పలువురు ప్రముఖులు, రక్త దాతలు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌కు సంబంధించిన యానివల్ ఆక్టివిటీ రిపోర్ట్‌ను గవర్నర్ రిలీజ్ చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... రక్తం ఇచ్చిన వారికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా పెళ్లైన జంట, కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, బర్త్డే సెలెబ్రేషన్స్ చేసుకొనే వారు చాలా మంది వచ్చి బ్లడ్ ఇస్తున్నారని గవర్నర్ తెలిపారు.

ఒకరు బ్లడ్ ఇస్తే ముగ్గురికి ఉపయోగపడుతుందన్నారు. ఇండియాలో 2 సెకెండ్లలో ఒకరికి బ్లడ్ అవసరం అవుతుందని అన్నారు. ప్రజల్లో రక్తదానం, సీపీఆర్‌పై అవగాహన పెరగాలన్నారు. రెడ్ క్రాస్ సేవలు బాగున్నాయని.. బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారని, తలసేమియా పెషేంట్లను కాపాడుతున్నారని అభినందించారు. అత్యవసర సమయాలలో చూడడానికి చాలా మంది బంధువుల వస్తారని.. కానీ బ్లడ్ ఇవ్వడానికి రారని అన్నారు. 300 ఎమ్‌ఎల్ బ్లడ్ ఇస్తే 10 నుంచి 15 రోజుల్లో శరీరంలో ప్రొడ్యూస్ అవుతుందని చెప్పారు. బ్లడ్ ఇచ్చి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఆక్సిడెంట్స్ పెరుగుతున్నాయని, ఎమర్జెన్సీ సిట్యువేషన్‌లో ఉన్న వారికీ తమరు ఇచ్చే బ్లడ్ ఉపయోగపడుతుందన్నారు. బ్లడ్ డోనర్ డే‌లో భాగంగా రెడ్ క్రాస్ 51 వేల యూనిట్స్ రక్తం సేకరించారని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

కాగా... బ్లాడ్ డొనేషన్ క్యాంప్‌లో రెడ్ క్రాస్ సొసైటీ అధికారులు, పలువురు ప్రముఖులు, రక్త దాతలు పాల్గొన్నారు. బ్లాడ్ డొనేషన్ క్యాంప్‌లో భాగంగా రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకువస్తున్నారు. ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి గవర్నర్ అవార్డులను అందజేయనున్నారు. బ్లడ్ డోనర్ డేలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 4500 యూనిట్స్, ఎస్‌బీఐ స్టాఫ్ 1560 యూనిట్స్, ఉస్మానియా యూనివర్సిటీ 1260 యూనిట్స్ పలు సెక్టార్స్ రక్తదానం చేశారు.

Updated Date - 2023-06-14T13:21:34+05:30 IST