Home » Duddilla Sridhar Babu
మీ సేవ నిర్వాహకుల కమీషన్‌ను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలోనే తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎంతమేరకు కమీషన్ పెంచాలనే విషయాన్ని చర్చించి జనవరి నుంచి అమలు చేస్తామని తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుమ్మక్కయ్యాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కుట్రపూరితంగా వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసిన చరిత్ర బీజేపీకి ఉందని పేర్కొన్నారు.
సుదీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీఎ్‌సడబ్ల్యూయూ(ఐఎన్టీయూసీ) ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా కంపెనీ షూఆల్స్ ప్రకటించింది. ఈ కంపెనీ.. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.
అమెరికాకు చెందిన థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ‘బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ (బీడీసీ)’ను నెలకొల్పబోతోంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్తో కలిసి హైదరాబాద్‌కు దక్షిణాన 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఐటీ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
మూసీ కూల్చివేతలపై పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.