Share News

Traffic Management: ట్రా‘ఫికర్‌’ తీర్చిన మంత్రి శ్రీధర్‌బాబు!

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:38 AM

సచివాలయం వైపు వెళ్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ట్రాఫిక్‌ను చక్కదిద్దిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Traffic Management: ట్రా‘ఫికర్‌’ తీర్చిన మంత్రి శ్రీధర్‌బాబు!

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సచివాలయం వైపు వెళ్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ట్రాఫిక్‌ను చక్కదిద్దిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి వచ్చిన కారు అంబేడ్కర్‌ కూడలి వద్ద అదుపు తప్పి, ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ఆదర్శ్‌నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్‌బాబు వాహనం దిగి, స్వయంగా ట్రాపిక్‌ను చక్కదిద్దారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫుట్‌పాత్‌పైకి వెళ్లిన కారును పక్కకు జరిపారు. ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి కారును అక్కడి నుంచి తీసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దాదాపు 10 నిమిషాలకు పైగా అక్కడే ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు ట్రాపిక్‌ ఇబ్బంది తొలగిన తర్వాత బయల్దేరి వెళ్లారు.

Updated Date - Dec 02 , 2024 | 03:38 AM