Home » Duddilla Sridhar Babu
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
దిగ్గజ ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ రాష్ట్రంలో రూ.750 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రూ.183 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ.
రాష్ట్ర మహిళా కమిషన్ చైౖర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్ బుద్ధ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అమెరికాకు చెందిన టెలి కమ్యూనికేషన్ దిగ్గజం మైక్రోలింక్ నెట్వర్క్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలకా్ట్రనిక్ , ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎ్‌సయూ)లకు రాష్ట్రప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు.