Janasena: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు జనసేన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
ABN , Publish Date - Feb 27 , 2025 | 09:55 PM
Sundarapu Vijay Kumar: డబ్బులు ఇచ్చి తిటించే పద్ధతి వైసీపీలోనే ఉందని యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.

విశాఖపట్నం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌కు ఓరల్ డయేరియా వచ్చిందని విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ అని... అలాంటిది పవన్ కల్యాణ్‌పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ(గురువారం) విశాఖపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడాలి...రీల్స్ చేసుకోవడం కాదని హితవు పలికారు. దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హెచ్చరించారు.
చట్టం తన పని తాను చేసుకోపోతుంది..పోసాని కృష్ణ మురళి విషయంలో అదే జరిగిందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు తగినబుద్ది చెప్పిన వారిలో మార్పు రాలేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రేపు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుందని చెప్పారు. గడిచిన ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.
జీవీఎంసీతోపాటు వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్‌లలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు పోటీ పడి టెండర్లు వేస్తున్నారని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ గందరగోళం సృష్టించారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి సేవ్ డేమోక్రసీ అని నినాదాలు చేయడం దారుణమని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడాలి..ప్రతిపక్ష హోదా కోసం కాదని చెప్పారు. డబ్బులు ఇచ్చి తిటించే పద్ధతి వైసీపీలోనే ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విలువలు లేని వ్యక్తి: జనసేన నేత అమ్మిశెట్టి వాసు
విజయవాడ: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత అమ్మిశెట్టి వాసు ధ్వజమెత్తారు. విలువలు లేని వ్యక్తి.. సొంత భార్యనే రోడ్ల పాలు చేసిన దుర్మార్గుడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయించి కూటమి ప్రభుత్వం మాట నిలపెట్టుకుందని చెప్పారు. దోచుకుని, దాచుకున్న చరిత్ర దువ్వాడది, వైసీపీ నాయకులదని విమర్శించారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ధృతరాష్ట్రుడు పాలన మాకొద్దు అంటూ 11 సీట్లకే వైసీపీని ప్రజలు పరిమితం చేశారని అమ్మిశెట్టి వాసు విమర్శించారు.
అయినా ప్రతిపక్ష హోదా కావాలని సిగ్గు లేకుండా జగన్ అడుక్కుంటున్నారని అమ్మిశెట్టి వాసు ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రామంటూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు... అంబేడ్కర్ రాజ్యాంగం అని వైసీపీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదు ఆయన రాజ్యాంగం చదవండి.. భావజాలం అర్ధం చేసుకోవాలని చెప్పారు. వైసీపీ నేతలు ఇంకోసారి అసభ్యంగా మాట్లాడితే ప్రజలు కొడతారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ విజయవాడ రావాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి కూడా వైసీపీ నాయకులు సరిపోరని జనసేన నేత అమ్మిశెట్టి వాసు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్: మంత్రి కొల్లు రవీంద్ర
CM Chandrababu: వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఫోటోలు దిగిన చంద్రబాబు..
Posani Arrest: ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..
Read Latest AP News and Telugu News