AP Politics: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల షాక్.. ఏమైందంటే..
ABN , Publish Date - Dec 14 , 2024 | 08:53 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై అనేక కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు షాక్ ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు జారీ చేసింది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేశారు.
అయితే నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తాను భయపడేది లేదన్నారు. టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన కారుకు కూడా నిప్పంటించారని, చంపేస్తామని బెదిరించారని వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తల ఆగడాలపై తాను పోలీస్ స్టేషన్‌లో సాక్షాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు పోలీసులు ఇప్పుడు 41ఏ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి..
Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు
మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News