Home » East Godavari
అమరావతి: తెలుగుదేశం-జనసేన సమన్వయ సమావేశాలు ఆదివారం నుంచి జరగనున్నాయి. 29, 30, 31వ తేదీల్లో జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ఈ సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరవుతారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లోని యార్డు రీమోడ లింగ్ పనులు నత్తతో పోటీపడుతున్నాయి.దాదాపు ఐదేళ్ల పైనుంచీ కొనసాగుతూనే ఉన్నాయి.
కాకినాడ: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. నదిలో మునిగిపోయిన సమీపంలోనే మృతదేహాలను గుర్తించారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరి ఆచూకీ కోసం..
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుని సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
పనికిమాలిన చెత్త సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు.
అప్పట్లో ఎన్టీఆర్‌పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్‌ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
సామర్లకోట: చంద్రబాబును జైల్లో పెట్టి సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆరోపించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి సామర్లకోటలో ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చారని అన్నారు.
సామర్లకోటలో సీఎం జగన్ సభకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.