Jagan Sabha: సీఎం జగన్ సభకు వచ్చిన మహిళలకు ఘోర అవమానం..!
ABN , First Publish Date - 2023-10-12T12:04:20+05:30 IST
సామర్లకోటలో సీఎం జగన్ సభకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
కాకినాడ: సామర్లకోటలో సీఎం జగన్ (CM Jagan) సభకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ సభ కోసం అధికారులు భారీగా జనాన్ని తరలించారు. అయితే వచ్చిన వారికి అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. వచ్చిన వారందరినీ నేలపై కూర్చోవాలని అధికారులు ఆదేశించారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు తీసుకువచ్చి కింద కూర్చోమంటూ అవమానిస్తారా అంటూ మండిపడుతున్నారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవడానికి మహిళలు సిద్ధపడటంతో అధికారులు వారిని బతిమాలుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా మహిళలను బలవంతంగా తరలించిన అధికారులు వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. టాయిలెట్ల సదుపాయం కూడా కల్పించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సామర్లకోటలో జగనన్న ఇళ్ల కాలనీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రారంభించారు. పేదలకు ఇళ్లను అందజేశారు. అంతకు ముందు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. జగనన్న ఇళ్ల కాలనీ ప్రారంభం అనంతరం కాలనీని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు.